Friday, April 19, 2024

ఆర్‌అండ్‌బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

Diary of R&B Engineers Association

 

హైదరాబాద్ : తెలంగాణ ఆర్‌అండ్‌బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంగళవారం తెలంగాణ ఆర్‌అండ్‌బి శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సరం 2020 డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ రవీందర్ రావు, చీఫ్ ఇంజనీర్ మోహన్‌నాయక్, అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరం డైరీని ఆర్‌అండ్‌బి శాఖ సిబ్బందికి అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో డిపార్ట్‌మెంట్‌కు చెందిన పూర్తి సమాచారం, మొబైల్ నెంబర్స్ పొందుపరిచామని సిబ్బంది మంత్రికి వివరించారు. ప్రభుత్వ డైరీలాగానే ఈ డైరీ డిజైన్ కూడా బాగుందని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు.

Vemula unveils Diary of R&B Engineers Association
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News