Home కరీంనగర్ భక్తజన సంద్రం…రాజన్న క్షేత్రం

భక్తజన సంద్రం…రాజన్న క్షేత్రం

Vemulawada-Rajanna-Temple

వేములవాడ : తెలంగాణాలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిక్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు. తొలుత స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం, శ్రీఘ్ర దర్శనం, లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. మాస శివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ అధికారులు లఘు దర్శనం అమలు చేశారు. రుద్రాభిషేకం, మహా రుద్రాభిషేకం, శివకళ్యాణం, కుంకుమ పూజ, అన్న పూజ, కోడె మొక్కుతో పాటు పలు ఆర్జిత సేవల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఆధ్వర్యంలో డి.ఉమారాణి, గౌరీనాథ్, హరికిషన్, దేవేందర్, పిఆర్వో తిరుపతిరావు, ఎపిఆర్‌వో ఉపాధ్యాయుల చంద్రశేకర్, ఇన్స్‌పెక్టర్ ప్రతాప నవీన్‌లు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.