Tuesday, April 23, 2024

వృక్షవేదం చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది 

- Advertisement -
- Advertisement -

వృక్షవేదం పుస్తకం అద్భుతం

పుస్తకం చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది 

ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌ని కొనియాడిన ఉపరాష్ట్రపతి

Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవులు, ప్రకృతి చిత్రాలు పురాణాలలో ప్రకృతి గురించి చెప్పిన శ్లోకాలతో ప్రత్యేకంగా రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హైదరాబాద్‌లోని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి సోమవారం అందజేశారు. ఈ పుస్తకాన్ని చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుస్తకం చాలా అద్భుతంగా ఉందని, ఈ ప్రకృతి చిత్రాలను చూస్తుంటే తన చిన్నతనంలో తన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళతో కలిసి అడవుల్లోకి పోయి వచ్చిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రకృతికి దూరంగా ఉన్న వారికే వచ్చినది అని ప్రకృతితో కలిసి జీవించిన వారు కరోనా వైరస్ బారిన పడలేదన్నారు. ఈ సందర్భంగా పుస్తకంలో ప్రచురించిన వ్యర్థంగా వృక్షాలను నరికే వాడు నాడీ భాగంలో పుండు గల వాడవుతాడు అంటే ప్రాణవాయవు లోపం వలన వ్యాధిని పొందుతాడు అని అర్థం అనే శ్లోకంను చదివి వినిపించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం గొప్పగా విజయవంతమైందని, ఇతరులకు ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగుతుందని ఇదే విధంగా ముందుకు కొనసాగించాలని తన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్ ఖాతాలో ఈ క్రింది విధంగా తెలిపాడు. ‘రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని చూసి ఆనందం కలిగింది. ప్రకృతి పరిరక్షణకు సంబంధించి భారతీయ వాజ్ఞయంలోని శ్లోకాలు, వాటి అర్థాలు, తెలంగాణ రాష్ట్ర ప్రకృతి ఛాయా చిత్రాలతో పుస్తకాన్ని చక్కగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయం’ అని ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

Venkaiah Naidu praises on MP Santosh Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News