Wednesday, November 30, 2022

ప్రజాస్వామ్యాన్ని తినేస్తున్న అవినీతి చెదను నిర్మూలించాలి

- Advertisement -

Venkaiah Naidu says corruption eats into heart of democracy

 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య హృదయాన్ని అవినీతి చెద తినేస్తోందని, అందువల్ల అవినీతికి పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం పిలుపునిచ్చారు. అధికారుల అవినీతికి సంబంధించిన కేసులు సత్వరం పరిష్కారం కావలసి ఉందన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని, అయితే విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే అధికారులను నిరుత్సాహపర్చకూడదని ఆయన సూచించారు. జార్ఖండ్ రాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ కేబినెట్ కార్యదర్శి ప్రభాత్ కుమార్ రచించిన పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్: ఎ క్వెస్ట్ ఫర్ నైతిక్ భారత్ అనే పుస్తకాన్ని ఆదివారం వెంకయ్యనాయుడు తన నివాసంలో ఆవిష్కరించారు. ఔత్సాహిక అధికారులతో తాను కలసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేస్తూ చాలామంది యువ అధికార్లు తమ విధుల్లో స్వచ్ భారత్ వంటి ఆవిష్కరణలను తీసుకువస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగి నైతికత, ప్రజాసేవలో స్ఫూర్తిని వివరిస్తూ ఆదర్శవంతమైన అధికారి తన పరిధి లోని సమస్యలను సత్వరం పరిష్కరించాలని, విధుల్లో విశ్వసనీయత, సమగ్రత వంటి ఉదాత్తమైన లక్షణాలు ప్రదర్శించాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Venkaiah Naidu says corruption eats into heart of democracy

Related Articles

- Advertisement -

Latest Articles