Thursday, April 25, 2024

వెంకటేష్ ‘నారప్ప’ పాత్రలో ఒదిగిపోయారు

- Advertisement -
- Advertisement -

Venkatesh says thanks to Audience for Narappa success

 

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నారప్ప’. సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇటీవల అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ “నారప్ప సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారప్ప క్యారెక్టర్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాను. ఇక నా నెక్స్ట్ మూవీ ‘ఎఫ్ 3’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది”అని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసినప్పటికీ గ్రామాల్లోని ప్రజలు కూడా చూస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రియమణి మాట్లాడుతూ “వెంకటేష్ ‘నారప్ప’ పాత్రలో ఒదిగిపోయారు. ఆయనతో కలిసి పనిచేసిందుకు చాలా హ్యాపీగా ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, డి.సురేష్‌బాబు, కార్తిక్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News