Friday, April 19, 2024

మెగాస్టార్ చిరుతో ‘భీష్మ’ డైరెక్టర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జోరు మామూలుగా లేదు. వరుసగా సినిమాలను ప్రకటిస్తున్న యంగ్ హీరోలకు ఝలక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజిబిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ పూర్తిచేసిన చిరు..  ‘భోళాశంకర్’, ‘గాడ్ ఫాదర్’, బాబితో మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా మరో ప్రాజెక్టును చిరు ప్రకటించాడు. ఈ మూవీని యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కంచనున్నాడు. ‘చలో’, ‘భీష్మ’ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న వెంకీ.. ఈ సారీ ఏకంగా మెగాస్టార్ తో ఛాన్స్ కొట్టేశాడు. చిరు 156వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు.

Venky Kudumula and Chiranjeevi team up for New Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News