Home తాజా వార్తలు తంగేడు పూవుల్ల చందమామ..

తంగేడు పూవుల్ల చందమామ..

 

Venna Muddala Bathukamma

 

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో చక్కగా ఆడుతూ పాడుతూ ఆడపడుచులు సందడి చేస్తున్నారు.

నేడు వెన్నముద్దల బతుకమ్
ఎనిమిదవ రోజున అమ్మకు వెన్నతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందమైన బతుకమ్మను పేర్చి , సాయం కాలం యువతులందరూ కోలాటాలాడుతూ ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు అమ్మవారి ప్రసాదం వెన్న ముద్దలు.

ప్రసాదం ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం…
కావలసినవి: వెన్న 1 కప్పు, నువ్వులు 2 కప్పులు , నెయ్యి 1 కప్పు, బెల్లం 1 కప్పు, జీడి పప్పులు 6.
తయారీ విధానం: స్టౌ పై పాన్ పెట్టి నువ్వులు వేయించి పెట్టుకోవాలి. తరువాత మిక్సీలో పొడి చేసుకుని పెట్టుకోవాలి. పాన్‌లో నువ్వుల పొడి, వెన్న ముద్ద, నెయ్యి, బెల్లం తురుమి కలపాలి. తరువాత అన్నింటినీ కలిపి ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. జీడి పప్పులను ( నేతిలో వేయించినవి) లడ్డూలపై అందంగా అమర్చాలి.

బతుకమ్మ పాటలు

బతుకమ్మ మొగ్గలు

ఆ చుక్కలు నింగిని వదిలి నేలకు జారి
పూలజన్మ ఎత్తాలని తపములెన్నో చేశాయి
బతుకమ్మ మేనిపై చుక్కల దీపాలు
ఆ కొండకోనల్లో విరిసిన పూబాలల్లారా
వేగిరమే కదిలిరండి వేడుకలు చేద్దాము
బతుకమ్మకు పూలజడల గోపురం
హరివిల్లులు వంగి ఇపుడు నేలను ముద్దాడి
తమ రంగులు పువ్వులకు అద్ది మరీ వెళ్ళాయి
పూలతేరు బతుకమ్మ మురిపాల ముద్దుగుమ్మ
కోలాట చప్పుళ్ళను కోయిలలు చూసి మరీ
గున్నమామిడి కొమ్మెక్కి పాటలన్నో పాడాయి
బతుకమ్మ పెదవులపై పువ్వుల నవ్వులు
వాగులన్నీ నదులుగా మారాలని నేడు
చినుకులన్నీ నేలపైకి చిందులేస్తూ జారాయి
అందాల బతుకమ్మ నీటి ఊయల్లోన పసిడి బొమ్మ

Today is venna muddala bathukamma festival celebrations