Home తాజా వార్తలు ప్రముఖ నటుడు రంగనాథ్ మృతి

ప్రముఖ నటుడు రంగనాథ్ మృతి

Ranganathహైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు రంగనాథ్(66) శనివారం కన్నుమూశారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో మనందరిని అలరించిన రంగనాథ్ కవాడిగూడాలోని ఆయన స్వగృహంలో మరణించారు. రంగనాథ్ మృతి పై ఆయన, బంధువులు పోలీసుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రంగనాథ్ మృతి వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇంక తెలియలేదు. 1949లో చెన్నైలో జన్మించిన రంగనాథ్ ఎన్నో విభిన్న మైన పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. సినిమాల్లోకి రాకముందు రంగనాథ్ రైల్వే టిసిగా పనిచేశారు. బుద్ధిమంతుడు సినిమాతో తెరంగేట్రం చేసిన రంగనాథ్ దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. రంగనాథ్ నటనకు గుర్తింపు తెచ్చిన సినిమా ‘పంతులమ్మ’. 50 చిత్రాల్లో హీరోగా, 50 చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. మొగుడ్స్-పెళ్లామ్స్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. రంగనాథ్ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.