Home నల్లగొండ బండ బారిన బతుకులు

బండ బారిన బతుకులు

Washerman

సౌడు నుంచి సర్ఫ్ వరకూ మారినా ఆదరణ కరువు
చాలీచాలనీ ఆదాయంతో కష్టంగా మారిన జీవితం
ప్రభుత్వం ఆదుకోవాలని రజకుల వేడుకోలు

హాలియా: పూర్వకాలంలో ఏ శుభకార్యాలైనా, మంచి అయినా చెడు అయినా చాకలి లేనిదే పని జరిగేది కాదు. అప్ప ట్లో పటేండ్లు, పట్వారి ఇండ్లతో పాటు ఇతర అగ్రకులాల ఇంట్లో పనిచేస్తే భోజనం పెట్టెవారు. వారు పెట్టిన భోజనం వారి కుటుంబానికి మొత్తానికి సరిపోయేది. దీంతో ఇంట్లో భోజనం వండుకునే పని తప్పేది. భోజనంతో పాటు నెలవారిగా జీతభత్యాలు ఇచ్చేవారు. రాను రాను మారుతున్న కాలంతో పాటు ఈ ఆచార అలవాట్లు అడుగంటిపోయాయి. దీంతో చాకలి బ్రతుకులు దుర్భరంగా మారాయి. సౌడు నుంచి సర్ఫ్ వరకు వచ్చిన చాకలి బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రామాల్లో పటేండ్లు, ఇతర కులాల వారు పనికి పిలవడం లేదు. వారి ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగిన, మంచి అయినా, చెడు అయినా వాటి కోసం పిలవడం లేదు. ఎవరో ఒక్కరు ఆచారం పద్దతిగా పిలిచినా కొద్దో గొప్పో ఇస్తున్నారు.

దీంతో చాలిచాలని బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. ఎవరో ఒక్కరి ఇంట్లో పని చేస్తే మనిషిలెక్క డబ్బులు ఇస్తున్నారు. ఒక జత బట్టలు ఉతికి ఇస్తే రూ.15 ఇస్తున్నారు. దీంతో పూట గడవడం కష్టంగా మారింది. పనికి పిలిచే వారు కరువైయ్యారు. జీవనోపాధి లేక ఇస్త్రీ డబ్బా అ యినా పెట్టుకుందామనుకుంటే ఇస్త్రీ పెట్టె ధర రూ.4500-5000 వరకు ఉంది. బొగ్గుల ధర కిలో 50 రూపాయలు. ఇంత పెట్టి కొనలేక కుల వృత్తిని వదిలిపెడుతున్నారు. కొంత మంది అప్పు చేసి ఇస్త్రీ డబ్బా పెట్టుకుంటే అరకొర ఆదాయం మాత్రమే వస్తుంది. దీంతో పూట గడవక తెచ్చిన అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంటున్నది.

ఒక జత బట్టలు ఇస్త్రీ చేస్తే 10 రూపాయలు వస్తుంది. దీంతో కుటుంబం పోషించలేక అప్పులపాలవుతున్నారు. అన్ని కులాల వృత్తుల వారికి రేట్లు పెరుగుతున్నాయి. ఒక మంగళి గడ్డం చేస్తే 30 రూపాయలు వరకు ఇస్తున్నారు. చాకలి ఒక జత బట్టలు ఇస్త్రీ చేస్తే 10 రూపాయలు ఇస్తున్నారు. దీంతో చాకలి వృత్తికి ఆదరణ కరు వైంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన చాకలి బ్రతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉన్నదని వారు వాపోతున్నారు. దీంతో చాకలి బ్రతుకులు వలస బ్రతుకులుగా మారి వెళ్లిపోతున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి దగ్గర నిలబడి బట్టలు ఇస్త్రీ చేస్తే 200 నుంచి 250 రూపాయలు మాత్రమే వస్తున్నాయని పెరిగిన ధరలకు ఈ డబ్బుతో కుటుంబాన్ని పోషించలేక, పిల్లలను చదువుపించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో మార్లు మా బ్రతుకులు మారాలని ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, దోబి గాట్లు ఏర్పాటు చేసి, బ్యాంకుల ద్వారా మాకు రుణాలను అందజేసి రజకులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.