Home ఎడిటోరియల్ పద్య శిఖరం డా॥ కూరెళ్ళ విఠలాచార్య!

పద్య శిఖరం డా॥ కూరెళ్ళ విఠలాచార్య!

నర్రా ప్రవీణ్ రెడ్డి

poetryపద్యం తెలుగోడి ఆస్తి, అస్తిత్వం కూడా. వేదాంగాలలో ఒకటైన ఛందస్సుతో బాటు అలంకార, వ్యాకరణ శాస్త్రాల శోభతో వెలిగే పద్యం. తెలుగు పద్యానికి వెయ్యికి పైగా సంవత్స రాల చరిత్ర ఉన్నది. ఈ చరిత్రలో ఎంతో మంది కవులు మaణిపూసల్లా ప్రకాశించి పద్యానికి సేవ చేశారు. తద్వారా కీర్తిని పొందారు. ఆ బాటలోనే నడిచి సాహిత్య సేవ చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కవి డా॥ కూరెళ్ళ విఠలా చార్య. వీరు 1940లో లక్ష్మమ్మ, వెంకట రాజయ్యగార్లకు నీరునెమల గ్రామం, రామన్న పేట మండలం, నల్లగొండ జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం వెల్లంకిలో నివాసం ఉంటున్నారు. ఆయ న గురించి సాహితీ పరులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మంచి కవిత్వంతో అందరిని అలరించిన వాడు. అందరూ నావాళ్లే అనుకునేవారు.
తెలుగులో గొలుసు కట్టు నవలలు వుంటా యన్న విషయం చాలా మందికి తెలియదు. అలాంటి కాలంలో ఎన్నో గొలుసు కట్టు నవలలపై పరిశోధన చేసి వాటిని వెలుగులోకి తెచ్చారు. ఆ కార్యంలో ఆయన కృషి వర్ణించలేనిది. స్వర్ణ కారుడు తన వృత్తిని దినదినాభివృద్ధి చేసుకొని అనేకానేక ఆభరణాలను అందంగా తయారు చేసి నట్లే శబ్దార్థ వశ్యులైన మహా కవులు ఛందస్సులో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. లయలో వచ్చే మార్పుతో జనించే నాదాన్ని తమ హృదయ నాద పౌనఃపుణ్యంతో మమేకం చేసి రసానందాన్ని అనుభవించారు. అలాంటి వాళ్లలో విఠలాచార్య ఒకరు. అతని పద్య రచనా విన్యాసానికి, తాను మెచ్చిన గ్రామీణ వాతావరణానికి విఠలేశ్వర శతకం నుండి ఈ పద్యం ఉదాహరణ.
ఉ॥పల్లియలోన పుట్టితిని, పల్లియయే
నను పెంచే తల్లియై
ఇల్లును వాకిలిన్ తనయి మేలిమి
బ్రతుకు మెరుంగు పెట్టె, ఆ
పల్లియ అమ్మ, ఆవనుచు పల్కులు
పంచగా నేరిపించె, నా
పల్లియె నాకు దైవతము ప్రాణము
ఓ ప్రభు విఠలేశ్వరా ॥
అంతేకాదు పద్యాన్ని ఎంత అందంగా అల్లగలడో వచనం కూడా అంత అందంగా రాయగలడు. అది మనం “కాన్ఫిడెన్షియల్ రిపో ర్ట్‌” లో చూడవచ్చు. వీరి “శిల్పాచార్యులు” ఖండ కావ్యం, గుఱ్ఱం జాషువా శైలిని తలపిస్తుం దన టంలో సందేహం లేదు. ఇందులోని “గో విలా పం” కావ్య ఖండిక ఎంతో ప్రసిద్ధి చెందింది. నేటి తరం విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉండ దగింది.
“Poetry is the Interpretation of Life” అని ఆర్నాల్డ్ అన్న వాక్యానికి కూరెళ్ళ రాసిన “దొందూ దొందే” గ్రంథం ఒక మచ్చు తునక.
“కడుపు పండని జీవితం / కడుపు నిండని జీతం
దొందూ దొందే / “దేవుడు లేని గుడి
దేశికుడు లేని బడి / దొందూ దొందే” ఇట్లాంటి జీవిత సారాలను తెలిపే మినీ కవితలకు ఈ కావ్యం పుట్టినిల్లు. ఇవేకాక “కవితా చందనం”, “తెలంగాణ కాగడాలు” వంటి కృతులు చదువు తూ వుంటే ఆయనలో ఒక దాశరథి, ఒక పోతన, ఒక వేమన కనిపిస్తాడు.
సీ॥చిట్టచివరి వాని పొట్ట నిండిన నాడు
ప్రత్యేక తెలంగాణ పసిడియగును
సంక్షేమ ఫలములు సఫలమైన నాడు
వచ్చిన తెలంగాణ స్వర్ణమగును
పల్లెపట్టున పైరు పల్లవించిన నాడు
కనుగొన్న తెలంగాణ కనకమగును
ఆబాలగోపాల మార్తిచెందని నాడు
ఈ మన తెలంగాణ హేమమగును
తే॥ మాతలను, వృద్ధులును అన్నదాతలున్ను
కార్మికులు ధార్మికులు కళాకారులున్ను
ఘనముగా సర్వజనము జీవనము సేయ
కాంతులిడు తెలంగాణ బంగార మగును
ఇటువంటి భావిదర్శనాన్ని కాంక్షించే కూరెళ్ళ క్రాంతి దర్శకుడిగా కూడా దర్శనమిస్తాడు. పద్యా నికి నిలువెత్తు రూపంలా కనిపిస్తాడు. సాహితీ కృషి ఒక ఎత్తైతే ఊళ్ళో తన ఇంటినే గ్రంథా లయంగా మార్చి పరిశోధకులకు, పండితులకు, విద్యార్థులకు ఎంతో సేవ చేయటం ఆయన మంచితనానికి నిదర్శనం. జిల్లాలో అనేకానేక సంస్థలు, పత్రికలు స్థాపించుటకు కృషి సల్పుతున్న నల్లగొండ సాహితీ శిఖరం ఆచార్య కూరెళ్ళ. యువ కవులకు, నవ కవులకు స్ఫూర్తిగా నిలవట మే కాక వాళ్ళను మనస్ఫూర్తిగా ప్రోత్సహించే సుమనస్వి మధుర కవి కూరెళ్ళ.
తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా మంది గద్యంతో గర్జిస్తే కూరెళ్ళ పద్యంతో ఉద్య మించాడు. వెల్లంకి పల్లెను కన్న తల్లిలా చూసు కుంటూ, ఆ పల్లె తల్లి ఒడిలోనే జీవిస్తున్న కూరెళ్ళ ఆదర్శప్రాయుడు. ఆయనపై విశ్వవిద్యా లయాలల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. అవి ఆయన గొప్ప తనానికి ప్రతీకలు.
వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి, సుద్దాల హనుమంతు, మహాకవి పోతన, అక్షర కళాభారతి వంటి పుర స్కారాలను గతంలో అందుకున్నారు. 2015 లో నల్లగొండ జిల్లా ఉత్తమ కవి అవార్డు పొందారు. అయినా, ఆయన నిగర్వి, నిరాడంబరుడు, అటువంటి గొప్ప వ్యక్తిని సోమనాథ కళాపీఠం పాలకుర్తి వారు “సాహిత్య ప్రపూర్ణ ” పురస్కారం తో గౌరవించడం అభినందించదగిన విషయం. ఇది పల్లెపట్టున పరిమళిస్తున్న పద్యానికి జరుగు తున్న పట్టాభిషేకం.
(పాలకుర్తిలో నేడు ‘సాహిత్య ప్రపూర్ణ’ బిరుదు స్వీకరిస్తున్న సందర్భంగా)
– 9393636405