Home ఎడిటోరియల్ గుబాళిస్తున్న కవిత్వం

గుబాళిస్తున్న కవిత్వం

Ashoka-tejaఏ గూటి చిలుక ఆగూటి పలుకే పలుకు తుందంటారు. పాటను పోరా ట పటిమను తన తండ్రి వారసత్వంగా పొంది ‘డా॥ సుద్దాల అశోక్‌తేజ’ గారు తన బాల్యంలోనే కవితాబీజాలను నాటు కున్నారు. చిన్నప్పటి నుండి పాట స్వరాన్ని విని జీర్ణించుకున్న జీవితం వీరిది. 4వ తరగతిలో ఉన్నప్పుడే అశోక్‌తేజ గారు “ధగధగలాడే జెండా, నిగనిగ మెరిసే జెండా- వినవే పేదల గాథ – చల్లారదు ఆకలిబాధ” అంటూ పాట వ్రాసి వాళ్ళ నాన్నకు చూపించారు. ప్రశంసింక చపోయినా, ఆ వయసులో ఆ భావజాలంతో ఉబికివచ్చిన గేయరచనా ప్రయత్నాన్ని మాత్రం అభినందించే ఉంటాడు నాన్న.
బాల్యంలో నాన్న సుద్దాల ‘హన్మంతు’ గారి ప్రభావంతో ఎదిగినా, వీరిగురువులు – జ్ఞాన పీఠ అవార్డు గ్రహీతి “డా.సి. నారాయణ రెడ్డి” గారి ప్రభావం వీరిని పాటల ప్రపంచం లోనే స్థిరంగా నిలిపింది. పోరుబాట, పల్లె పాటల వారసత్వాన్ని అందుకున్న “డా॥ అశోక్ తేజ ” గారి కవిత్వంలో భావావేశం, భావో ద్వేగం, ఆర్ధ్రతలు కనిపిస్తాయి. తన తండ్రి ప్రారంభించిన ఈ సాంఘిక యక్షగానాన్ని సమర్థ వంతంగా పూర్తి చేసి వారసుడనిపించు కున్నా రు. తెలంగాణలో యక్షగానాన్ని వీధి నాటకా లంటారు. ఈ రచనలో కేవలం వస్తువే కాదు రూపం కూడా ప్రజలదే, భాష, భావ వ్యక్తీకరణ అన్నీ తెలంగాణ ప్రజలదే. ఈ రచన పూర్తిగా వ్యవహారికం. ‘నల్లగొండ’ జిల్లా మాండలికం లో చేసారు. ఈ రచనలో కన్పించే ‘గడ్డం అమీ ను’ , ‘రాధ’ పాత్రలు అశోక్‌తేజ గారు కల్పిం చిన పాత్రలు. మూలరచనలో లేని ‘రామిరెడ్డి’ పాత్ర ఆనాటి దొరలకు ప్రతీక అయిన పాత్ర.
“కట్టు గానుగవోలే పుట్టు బానిసవోలే
గతిలేక మతిలేక బతికే పీనుగవోలే
మనలేడు పోరాడే ధీరుడే -వాడు
బలియైన అరిగొచ్చె సూరీడు- అంటూ
‘నాగయ్య’ పాత్ర ద్వార రాసిన వాక్యం ఆలోచింప జేస్తుంది. ఆనాటి తెలంగాణ కట్టు బానిస త్వాన్ని దాని నిర్మూలనకై పోరాడుతున్న పోరాట యోధులు అమరులైన సూరీడులా మళ్లీ పుడ తారని వీరు చెప్పడం కొత్త ఒరవడి.
నవ్వితే చాలు రవ్వ లు పదివేలు- ఎవ్వతిరా ఈ పోరీ, దీనియవ్వ ఎంతటి సుకుమారి” సలలిత శృంగారాన్ని జోడించిన అశోక్‌తేజగారి పద లాలిత్వానికి, సహ జ వర్ణనకు మచ్చు తున కలు. కవిత్వానికి “ఊహే ప్రాణం ఊహలేని వాడిని ఊరితీయాలి” అన్నారు అశోక్ తేజగారు. డా॥ సుద్దాల అశోక్‌గారి బల మంతా ఊహల్లోనే వుంది. భావనాశక్తిలోనే ఉంది. వీరి “నేలమ్మా నేలమ్మా”రచనలోని మధుర భావాలు పాఠకు లను ఆలోచింప జేస్తాయి, “నేలమ్మా నేలమ్మా నీకు వేల వేల – వందనాలమ్మా ” అనే గీతంలో కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నవేమో సూర్యుడి గుడిచుట్టూ ’ అని వ్యాఖ్యానించడం ‘తల్లి’ పట్ల అతనికి వున్న కృతజ్ఞాతా భావానికి నిదర్శనం.
“శ్రమయే ద్రవీభవిస్తే కదిలే బాక్రానంగల్ –
శ్రమయే ఘనీభవిస్తే కానుక తాజు మహల్‌”-అనే గీతంలో శ్రమజీవి కష్ట సౌందర్యాన్ని రంగ రించిన సన్నివేశం సమాజ ప్రేమికులని ఆలోచింపజేస్తున్నది.
‘డా॥ సుద్దాల అశోక్ తేజగారి’ గారి కలం మూడు వేలకు పైగా పాటలను అందించింది. “జాతీయ పురస్కా రాన్ని స్వీకరించింది. ఇటీవలే 2014 సం॥ లో“గీతం యూని వర్సిటీ” ‘అశోక్ తేజ’ గారి గీతా లకు గాను “గౌరవ డాక్ష రేట్‌” పురస్కారాన్ని అందించింది. “దాశరథి గురజాడ, కొమరం భీమ్, కాళోజీ” ఇటీవల పల్లేరు స్వయంప్రభ వంటి పలు పురస్కారాలను అందుకున్న వీరి కలం స్ఫూర్తిదాయకం. వీరి జీవిత ప్రయా ణంలో గుండెను కదిలించే సన్నివేశాలు ఎదు రైతే ఆ ఇతివృత్తాన్ని పాటలు గా మార్చి రాసు కునే అలవాటు మొదటి నుండి వీరికి ఉంది.
గేయ నాటక రూపంలో వీరి సాహిత్యం వర్ధిల్లింది. ఏ పాట ఏ సంవత్స రంలో రాసిన ఆ పాటలో తన సొంత గొంతును, సొంత ముద్ర ను లీనం చేసి, కవితా ధ్వనిని విని పించే పదాల ప్రయోగం చేస్తారు. ప్రకృతి అంటే ‘అశోక్ తేజ’ గారికి పంచప్రాణాలు మట్టి పరిమళాలను ఆస్వాదించిన వాగ్గేయకారుడు ఆయన. శృంగారాన్నిరసరమ్యంగా, నేత్ర పర్వంగా వెండితెరకు అనువ దించడంలో “బహుముఖ ప్రజ్ఞాశాలి డా॥ రాఘవేంద్ర గారి సూచనతో ‘బాబి’ చిత్రానికి ‘వారెవ్వా ’ పల్లవితో పదావిష్కరణ చేసి రంజింపచేసారు.
“కళ్ళల్లో ద్రాక్షరసం- ఒళ్ళంతా చెరకు రసం
పరువం దానిమ్మరసం – చిట్టిపెదవి తేనెరసం
దీన్ని పట్టబోతే పాదరసం”- అంటూ అమ్మా యిని ‘నెమలి’తో ‘పాదరసం’తో చక్కగా ఈ కవి వర్ణించారు.
‘అశోక్‌తేజగారు ఓ పాటలో-
“నెమలీకన్నోడా -నమిలే చూపోడా” మరో చోట
“మీసాలు గుచ్చకుండా ముద్దాడలేవానీవు” అన్న ప్రియురాల ‘బాస’ కు ‘యాస’ను జోడించి వర్ణించారు.
“జడివానలో ఒడలు తడి/ జలధారులు కనుల నిలిపి/ రజింపే గులాబీల/శివరంజిని రాగాల లో ” – అంటూ మరోచోట
“రాధకు తెలుసు కృష్ణుడు రాడని
బాధకు తెలుసు గతం రానిదని” అంటూ
“లేఖ చెలిని నవ్వించే / రాక ప్రియుని నవ్వించే
మువ్వ పదమును నవ్వించే / నవ్వునవ్వుని నవ్వించే”- అంటూ – “ఇపసారలో ఏముం దిలే- రెప్పపాటు చూపే చాలు’ అని ఎన్నో గీతాల్లో మధురంగా వర్ణించారు.
చలన చిత్రాల గీతాల కృషీవలుడు డా॥ అశోక్‌తేజగారు. తెలంగాణ పల్లె మనసును, సంస్కృతిని, నుడి కారాన్ని, జీవితాలను పాట ల్లో ఆవిష్కరించారు. “పాట దరువు, పాటల్లో గాత్రాన్ని, గాత్రంలో ముద్రను పాటలతో, గేయా లతో, ప్రేమ, దయ, శ్రమైక జీవనత్వం, మానవీయతలు, అంతర్లీనంగా ఉంటాయి. కవిత్వాన్ని అందిపుచ్చుకున్న రచనా “గాంధ ర్వుడు” అశోక్ తేజ’ గారు అందుకే ఆయన ‘గీతం’ ‘మధురాతి మధురం’ – ఆయన జీవితం అమరం’.