Friday, April 19, 2024

కంఝవాలా కేసు: నిందితులపై హత్యా నేరం పెట్టండి!

- Advertisement -
- Advertisement -
బాధితురాలు కుటుంబం డిమాండ్

న్యూఢిల్లీ: చలిని సైతం లెక్క చేయకుండా కంఝవాలా కేసు బాధితురాలి కుటుంబ సభ్యులు మంగళవారం సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేశారు. నిందితులపై హత్యా నేరం మోపాలని డిమాండ్ చేశారు. నూతన సంవత్సరం వేకువ జామున అంజలి సింగ్ స్కూటర్‌ను నిందితులు కారుతో ఢీకొట్టడమే కాక ఆమెను 12 కిమీ. దూరం వరకు అంటే సుల్తాన్‌పురి నుంచి కంఝవాలా వరకు కారుతో లాక్కెల్లారు.

నిరసనకారుల గ్రూప్ సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ఎఫ్‌ఐఆర్‌లో ఐపిసి సెక్షన్ 302(హత్య)ను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. దీనికి ముందు అంజలి సింగ్ కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ బయట నిరసన ప్రదర్శన చేసి నిందితులకు శిక్ష విధించాలన్నారు.

ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు నిందితులైన దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిషన్(27)మిథున్(26), మనోజ్ మిట్టల్‌లను ఈ కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులు అశుతోష్, అంకుశ్ ఖన్నాలను అరెస్టు చేశారు. వారు నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపణ.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News