Friday, March 29, 2024

ప్రేమ… ప్రేయసికి వీడియో కాల్ చేసి.. గొంతు, మణికట్టు కోసుకున్నాడు…

- Advertisement -
- Advertisement -

Video call to lover after suicide in siddipet

 

సిద్దిపేట: ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ప్రేయసితో మాట్లాడుతూ యువకుడు మణికట్టు, గొంతు కోసుకున్న సంఘటన సిద్దిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మనోజ్ కుమార్ అనే యువకుడు ల్యాబ్ టెక్సీషియన్‌గా పని చేస్తు సిద్దిపేటలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. సిద్దిపేటకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబ సభ్యులకు తెలవడంతో పంచాయతీ పెట్టారు. ఇద్దరు దూరంగా ఉంటామని ప్రేమ జంట పెద్దలకు హామీ ఇచ్చింది. మనోజ్ బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం పైఅంతస్తులోకి వెళ్లిపోయాడు. ల్యాబ్ పరీక్షలు చేసిన అనంతరం అర్ధరాత్రి యువతికి వీడియో కాల్ చేశాడు. ఇదే క్రమంలో ఉద్వేగంతో తన చేతి మణికట్టు, గొంతు కోసుకున్నాడు. వెంటనే యువతి అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో వాళ్లు హుటాహుటినా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. యువకుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సంపత్ పేర్కొన్నారు. కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News