Home తాజా వార్తలు భీష్మ నుంచి వీడియో విడుదల

భీష్మ నుంచి వీడియో విడుదల

Bhishma Movieహైదరాబాద్ : యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా సినిమా ‘భీష్మ.’ ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.  సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి  రెండు పోస్ట‌ర్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్స్ ఆసక్తి కరంగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియోను గురువారం ఉదయం రిలీజ్ చేశారు.  ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 21. 2020న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా నితిన్  చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రానున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘చదరంగం’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా నితిన్ ఓ సినిమా చేయ‌నున్నాడు. అదేవిధంగా అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమాలో నితిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. వరుసబెట్టి సినిమాలు చేస్తూ నితిన్ బిజీగా ఉన్నాడు.

Video Release From Bhishma Movie