Home తాజా వార్తలు ’ఉప్పెన‘ సినిమా నుంచి వీడియో సాంగ్స్ విడుద‌ల‌

’ఉప్పెన‘ సినిమా నుంచి వీడియో సాంగ్స్ విడుద‌ల‌

Video Songs Release From Uppena Movieహైదరాబాద్ : మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ’ఉప్పెన‘. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా నటించారు.  ఫిబ్రవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.   దీంతో ప్రస్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. శనివారం రాత్రి ’ఉప్పెన‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు.  ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ద‌ర్శ‌కులు సుకుమార్, బాబి, శివ నిర్వాణ‌, సందీప్ రెడ్డి వంగా, కిషోర్ తిరుమ‌ల‌, గోపిచంద్ మ‌లినేని, వెంకీ కుడుముల‌, హరీష్ శంక‌ర్  తదిత‌రులు హాజరయ్యారు. ’ఉప్పెన‘ సినిమాలోని నీ క‌న్ను నీలి స‌ముద్రం అనే పాటు అందరినీ ఆకట్టుకుంది. ఈ పాట కోసం దేవి శ్రీ  అందించిన బాణీలు  ఆక‌ట్టుకున్నాయి. శనివారం రాత్రి ఈ సినిమా వీడియో సాంగ్‌తో పాటు ద‌క్ ద‌క్ అనే పాటను  విడుద‌ల చేశారు. ఈ పాటలు ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి.