Home తాజా వార్తలు ఆస్పత్రిలో చేరిన విద్యాబాలన్

ఆస్పత్రిలో చేరిన విద్యాబాలన్

Vidya-Balanముంబయి : బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురువారం అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. గురువారం తన భర్త సిద్దార్థ రాయ్ కపూర్‌తో కొత్త ఏడాది వేడుకలను జరుపుకోవడానికి అబు దాబీ ప్రయాణమైన విద్యా తీవ్ర వెన్ను నొప్పి రావడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. విద్యాకు ప్రథమంగా ఎయిర్‌పోర్ట్‌లో చికిత్స నిర్వహించి తర్వాత ఆమెను ముంబయిలోని ఖార్ హిందూజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి కిడ్నిలో రాయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.