చెన్నై : తమిళనాడులో సిఎం పోరు కోసం జరుగుతున్న రాజకీయ పోరు తుది దశకు చేరుకున్నట్లే అనిపిస్తుంది. బుధవారం అన్నాడిఎంకె పార్టీ శాసన సభ పక్ష నేత పళనిస్వామి రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. తన వర్గానికి చెందిన 10మంది ఎమ్మెల్యేలతో ఆయన గవర్నర్తో సమావేశమై.. 124మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందిజేశారు. అనంతరం రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా గవర్నర్తో సమావేశమయ్యారు. ఇరు వర్గాలతో సమావేశమైన అనంతరం గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ నిపుణుల సలహా మేరకు శాసనసభలో కాంపోజిట్ ఫోర్ల్ టెస్ట్ నిర్వహించాలని గవర్నర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందుకోసం శుక్రవారం ఉదయం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలోనే పన్నీర్ సెల్వం, పళని స్వామి బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.
శుక్రవారం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్..!?
- Advertisement -
- Advertisement -