Home జాతీయ వార్తలు వైరా నదిలో ముగ్గురు గల్లంతు

వైరా నదిలో ముగ్గురు గల్లంతు

Drown-Swimmingకృష్ణా : వీర్లపాడు మండలంలోని వెల్లంపల్లి వద్ద వైరా నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. కొణతాలపల్లి గ్రామానికి చెందిన సగ్గుల నాగేంద్ర (10), వీరంశెట్టి అరుణ్‌కుమార్(10)లు ఆదివారం ఉదయం నదిలో ఈతకు దిగి మునిగిపోయారు. వీరు మునిగివపోవడాన్ని చూసిన తుపాకుల శ్రీనివాసరావు అనే వ్యక్తి వారిని కాపాడేందుకు నదిలోకి దూకాడు. అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.