Home మహబూబ్‌నగర్ గద్వాల మున్సిపాలిటిలో విజి‘లెన్స్’

గద్వాల మున్సిపాలిటిలో విజి‘లెన్స్’

muncipalityగద్వాలరూరల్: అక్రమాలకు నిలయంగా మారిన గద్వాల మున్సి పాలిటిపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభు త్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలతో పాటు వృద్ధు లకు, పేదలకు పంపిణీ చేస్తున్న ఆసరా పథకం కూడా అవినీతి తా రాస్థాయిలో జరుగుతుంది.దీనిపై ఇప్పటికే మానవహక్కుల సం ఘం, డీఆర్‌డీఏ అధికారులు విచారణ సైతం చేపట్టారు.
ఇటీవలే విజిలెన్స్ అధికారులు కూడా గద్వాల మున్సిపాలిటిలో అకస్మిక దా డులు నిర్వహించి అవినీతికి సంబంధించిన దస్త్రాలన్ని దుమ్ముదు లిపి కొరడాఝులిపించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీంతో ఒక్క సారిగా గద్వాల మున్సిపాలిటిలో ఉన్న అవినీతి అధి కారులు, నాయకుల గుండెల్లో
గుబులు మొదలైంది.
తారాస్థాయిలో అవినీతి
గద్వాల మున్సిపాలిటి పరిధిలో 33వార్డులలో వికలాం గులకు 577, వృద్దులకు 3609, వితంతువులకు 3003, చేనేత కార్మికులు 1392, కల్లుగీత కార్మికులు 23, బీడీ కార్మికులు 01 పింఛన్లను ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు. వికలాంగులకు రూ.1500 చొప్పున, మిగితా లబ్ధిదారు లకు రూ.1000 చొప్పున మొత్తం రూ.88లక్షల93వేల 500లను అందజేస్తున్నారు. అయితే ఇందులో 35శాతం మేర అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నట్లు సమాచారం. దీనిపైన ఏకంగా పాలకమండలి కౌన్సిలర్లే పలు సమా వేశాల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే కాకుం డా మానవహక్కుల సంఘానికి సైతం ఫిర్యాదులు చేశా రు. వీటిపైన గత నెల డీఆర్‌డీఏ అధికారులు విచారణ చే పట్టగా ఈ నెల మొదటి వారంలో విజిలెన్స్ అధికారులు కూడా మున్సిపాలిటిలో విచారించి వివరాలను సేకరిం చారు. వీరు చేపట్టిన విచారణలో కూడా గద్వాల మున్సి పాలిటిలో ఆసరా ఫథకంలో అక్రమాలు జరిగినట్లు గు ర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం నివే దికను చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు నివేధించగా డీఆర్‌డీఏ అధికారులు అక్రమాల చిట్టను జిల్లా కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆసరా ప థకానికి అర్హులైన వారందరికి పారదర్శకత కోసం వ్యక్తిగ త బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే పింఛన్లను పంపిణీ చేయాలని నిబంధన పెట్టింది. కాని ఇందుకు భిన్నంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బులను అందజేస్తున్నారు. కొ ంత మంది ప్రజాప్రతినిధులే పేదలకు దక్కాల్సిన పింఛ న్లను జేబులు .నింపుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సుమారు రూ.30లక్షల కు పైగానే పక్కదారి పడుతున్నట్లు తెలిసింది. ఈ అక్రమ తంతుపై ఉన్నతాధి కారులు ప్రత్యేక దృష్టి సారించడంతో అవినీతిపరుల్లో గు బులు మొదలైంది.
అధికారి ఏమన్నారంటే
ఈ అవినీతి వ్యవహారంపై డీఆర్‌డీఏ ఎపిడి వెంకటయ్య గౌడును వివరణ కోరగా లభ్ధ్దిదారులకు బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే పింఛన్లను పంపిణీ చేయాలి. అయితే గ ద్వాల మున్సిపాలిటిలో అలా జరగడం లేదు.