Home తాజా వార్తలు ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ

ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ

 

Vijay Devarakonda

 

ఢిల్లీ: ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండకు చోటుదక్కింది. భారత్ లో 30 ఏళ్ల వయసు కన్న తక్కువగా ఉండి వివిధ రంగాల్లో అత్యుత్తమైన ప్రతిభ కనబరిచిన యువకులకు పోర్బ్స్ జాబితాలో స్థానం కల్పిస్తుంది. 2011వ సంవత్సరంలో ‘నువ్విలా’ సినిమాతో దేవరకొండ టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. ‘ ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో మంచిగా నటించడంతో పేరు వచ్చింది. దాని వెంటనే ‘పెళ్లి చూపులు’ సినిమా సక్సెస్ కావడంతో పాపులారిటీ పెరిగింది. అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్‌  హిట్ కావడంతో టాలీవుడ్ యంగ్ హీరోలలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు విజయ దేవర కొండకు ఉన్న క్రేజ్ ఏ తెలుగు హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ప్రముఖులు విజయ దేవరకొండ గురించి చర్చిస్తున్నారు. 2018వ సంవత్సరంలో ‘గీతాగోవిందం, మహానటి’ వంటి సినిమాలు హిట్ కావడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘డియర్ కామ్రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్‌లకు చోటు దక్కించుకున్నారు.  రౌడీ పేరిటి ఓ షాపింగ్ మాల్ ప్రారంభించారు. 

 

 

 

 

 

 

 

Vijay Devarakonda in Forbes India 30U30 2019