Tuesday, April 23, 2024

‘ఫైటర్’ అప్డేట్స్: విజయ్ దేవరకొండ, అనన్య రొమాంటిక్ ఫోటో లీక్..

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: రాకింగ్ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘ఫైటర్’. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా విజయ్ బైక్ నడుపుతుండగా, అనన్య బైక్ పెట్రోల్ ట్యాంక్ పై విజయ్ కి ఎదురుగా కూర్చున్న ఫోటో లీక్ అయ్యింది. ఈ ఫోటోని బట్టీ.. వీరిద్దరి మధ్య రోమాంటిక్ సీన్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రడ్యూసర్ కరణ్ జోహార్ తో పూరి, ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సౌత్ తోపాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు.

Vijay Deverakonda, Ananya get cosy on bike for shoot

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News