Wednesday, April 24, 2024

విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్

- Advertisement -
- Advertisement -

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది. విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్ అనేలా ఆ ఇద్దరి ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

అలాగే ఇదో స్వచ్ఛమైన మనసుల కథ అని తెలిసేలా చుట్టూ తెల్లని మంచు కొండలు, తెల్లని పావురాల మధ్య మనసంతా స్వేచ్ఛా విహంగంలా మారింది అనేలా విజయ్ సోలో ఫోటో సైతం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ పోస్టర్ చూడగానే ఈ మూవీ ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో అని అర్థం చేసుకోవచ్చు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ‘ నా రోజా నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాబోయే ఈ పాటతో మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా ఈ లిరికల్ సాంగ్ ఉంటుంది.ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News