Home తాజా వార్తలు గోవాలో మార్షల్ ఆర్ట్ ఫైట్స్

గోవాలో మార్షల్ ఆర్ట్ ఫైట్స్

Vijay deverakonda liger commences new schedule in goa

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, ఛార్మీల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బుధవారం గోవాలో ‘లైగర్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్‌ను షూట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ‘బ్లడ్.. స్వెట్… వయోలెన్స్ #లైగర్ షూటింగ్ తిరిగి ప్రారంభం’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘లైగర్’ షూటింగ్ లొకేషన్ నుండి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ ఎంఎంఎ ఫైటర్‌గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్‌లో విదేశీ ఫైటర్స్ కూడా భాగం కాబోతున్నారు. ఈ స్పోర్ట్ యాక్షన్ థ్రిల్లర్ కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా న్యూ లుక్‌లోకి మారాడు. సినిమా కోసం మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్ నేర్చుకొని నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా…థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచా ఈ సినిమాకు వర్క్ చేస్తుండటం విశేషం. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్‌జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Vijay deverakonda liger commences new schedule in goa