Home తాజా వార్తలు నాకు స్పెషల్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ : విజయ్ దేవరకొండ

నాకు స్పెషల్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ : విజయ్ దేవరకొండ

Vijay Deverakonda

 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని శుక్రవారం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “నాకు స్పెషల్ మూవీ ఇది.

ఏడాది పాటు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాను. నా సినిమా తొలిసారి నాలుగు భాషల్లో విడుదలైనందుకు ఆనందంగా ఉంది. రివ్యూ రైటర్స్ సినిమాను ప్రశంసిస్తూ రాశారు. బాబీ, లిల్లీ జీవితంలో నాలుగేళ్ల జర్నీని చూపించే సినిమా ఇది. లిల్లీగా రష్మిక అద్భుతంగా నటించింది”అని అన్నారు. దర్శకుడు భరత్ కమ్మ మాట్లాడుతూ “నిజాయితీగా చేసిన సినిమా ఇది. ఈ చిత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు.

లిల్లీ క్యారెక్టర్‌లో రష్మిక నటన ఆకట్టుకుంటుంది. సినిమాకు మంచి స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది”అని చెప్పారు. రష్మిక మందన్న మాట్లాడుతూ “ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. సినిమా కోసం అందరం బాగా కష్టపడడం వల్లే మంచి హిట్‌ను సాధించాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి, యష్ రంగినేని తదితరులు పాల్గొన్నారు.

Vijay Deverakonda said Dear comrade Movie Special for me