Home అంతర్జాతీయ వార్తలు మాల్యా అప్పగింతకు రంగం సిద్ధం

మాల్యా అప్పగింతకు రంగం సిద్ధం

vijay Mallya Surrender to India from Britan

ఢిల్లీ : భారత్ లోని పలు బ్యాంకులకు వేల కోట్లను ఎగ్గొట్టి బ్రిటన్ కు పారిపోయిన విజయమాల్యాను భారత్ కు అప్పగించేం దుకు బ్రిటన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అయితే తనను భారత్ కు అప్పగించవద్దని మాల్యా పెట్టుకున్న పిటిషన్ ను గత నెల 14న లండన్ కోర్టు కొట్టివేసింది. మోసం, నేరకుట్ర, దుర్వినియోగం వంటి కేసుల్లో మాల్యాపై సిబిఐ విచారణ చేస్తుంది. దేశంలోని వివిధ బ్యాంకులకు మాల్యా సుమారు తొమ్మిది వేల కోట్లను ఎగ్గొట్టారు.తాను బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని మాల్యా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం లండన్ లో ఉన్న మాల్యాపై 130 కోట్ల డాలర్ల ల్యాండరింగ్ కేసు కూడా నమోదైంది. 2016లో ఆయన భారత్ నుంచి బ్రిటన్ పారిపోయారు. కరోనా కారణంగా భారత్ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 20 లక్షల కోట్లతో ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీని విజయ మాల్యా స్వాగతించారు. అయితే తనపై కేసులు ఎత్తివేయాలని, తాను చెల్లించాల్సిన మొత్తం బాకీలను చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శిస్తున్న విషయం తెలిసిందే.