Home తాజా వార్తలు ’96’ మూవీ ట్రైలర్ రిలీజ్… మరింత గ్లామర్ గా త్రిష

’96’ మూవీ ట్రైలర్ రిలీజ్… మరింత గ్లామర్ గా త్రిష

Vijay Sethupathi 96 Movie Official Trailer

సినిమా: తమిళంలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా ’96’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సిన్మాకి నందగోపాల్ నిర్మాతగా ఉన్నారు. ఆగస్టు 31వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ వెల్లడించింది. తాజాగా ఈ సిన్మా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఫ్లాష్ బ్యాక్ కి  సన్నివేశాలను, ప్రస్తుతం జరుగుతోన్న సన్నివేశాలను జోడిస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేసి రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి, త్రిష పాత్రలపై కట్ చేసిన ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సిన్మాలో విజయ్ సేతుపతి న్యూ లుక్ తో కనిపిస్తుంటే, త్రిష మరింత గ్లామర్ గా కనబడుతోంది. ఈ చిత్రం తమ కెరియర్ కి పక్క సక్సెస్ అందిస్తుందనే నమ్మకాన్ని హీరో హీరోయిన్లు భావిస్తున్నారు.ఈ సిన్మా వాళ్ల నమ్మకాన్ని  ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరీ.