Friday, March 29, 2024

అమ్మ కలను నెరవేర్చే చిత్రం

- Advertisement -
- Advertisement -

Vijaya Raghavan pre release event

బిచ్చగాడు, డా.సలీమ్, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఆయన హీరోగా డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘విజయ రాఘవన్’ చిత్రాన్ని ఈనెల 17న శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు రవిచంద్రా రెడ్డి, శివా రెడ్డి మాట్లాడుతూ “దర్శకుడు ఆనంద్ కృష్ణన్ అద్భుతమైన కథతో ఈ సినిమా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది”అని అన్నారు. చిత్ర దర్శకుడు ఆనందకృష్ణన్ మాట్లాడుతూ “ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ యువకుడి కథే ఇది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో సందేశం కూడా ఉంది”అని తెలిపారు. హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ “ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ‘బిచ్చగాడు’ ఓ అమ్మ కథ అయితే, ‘విజయ రాఘవన్’ ఓ అమ్మ కలను నెరవేర్చే చిత్రం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News