Tuesday, April 23, 2024

కీలక సన్నివేశాల చిత్రీకరణలో..

- Advertisement -
- Advertisement -

Vikram movie second schedule is over

 

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్. ఈ ప్రతిష్టాత్మక చిత్రం లో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా ముగిసిందని పేర్కొంటూ దర్శకుడు కనగరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ బైక్‌పై కూర్చొని ఉన్న పిక్‌ను షేర్ చేశారు. ఈ ఫొటో లో కమల్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్, స్టంట్ మాస్టర్ డుయో అన్బరీవ్ కనిపిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News