Home జాతీయ వార్తలు గుజరాత్ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌గా విక్రమ్‌నాథ్ ప్రమాణస్వీకారం

గుజరాత్ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌గా విక్రమ్‌నాథ్ ప్రమాణస్వీకారం

Vikram-nath
అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విక్రమ్‌నాధ్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. గాంధీనగర్ రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చేయించారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని, వివిధ ఉన్నతాధికార ప్రతినిధులు, హైకోర్టు జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసే ఆర్ సుబాష్ రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లిన తరువాత గత ఏడాది నవంబరు నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంటోంది. ఇంతవరకు జస్టిస్ అనంత దావే తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. జస్టిస్ విక్రమ్ నాధ్ ఇంతవరకు అలహాబాద్ హైకోర్టు జస్టిస్‌గా ఉండేవారు.

Vikram Nath sworn in as Chief Justice of Gujarat HC