*3కోట్ల 84లక్షలతో ద్వారకపేటలో అభివృద్ది పనులు
*ముప్పై డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన
*శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూదన చారి
మన తెలంగాణ/టేకుమట్ల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలంలోని ద్వారకపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ కత్తి సుమలత సంపత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల శంకుస్థాపనకు శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ శనివారం చేశారు. ద్వారకపేట సర్పంచ్ కత్తి సుమలత సంపత్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్‌కు డప్పు చప్పుళ్లతో, మంగళహారతితో, కోలాట బృందాల మహిళల నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ సిరికొండ మధుసూదన చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేద ప్రజలను ధనవంతులతో సమానంగా చూసేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మీ, గొల్లకురుమ కులస్తులకు సబ్సిడీ గొర్రెలు, నిరుద్యోగ యువతకు ప్రొత్సహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బిసి, కార్పొరేషన్ యువతకు రుణ సౌకర్యాలు కల్పించడంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించడం జరుగుతుందని ప్రతి నిరుపేద వాడికి ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, ద్వారకపేట గ్రామంలో గత 70సంవత్సరాలలో జరుగని అభివృద్ధి పనులు టిఆర్‌ఎస్ ప్రభు త్వం హయంలో మూడున్నర సంవత్సరంలో కేవలం ద్వారకపేట గ్రామంలో 3కోట్ల 84లక్షల అభివృద్ధి పనులు, ఒక కోటి 75లక్షలతో 30 డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ ఆడెపు సంపత్ కుమార్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కత్తి సంపత్ గౌడ్,సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు ఒరంగంటి సదాకర్ గౌడ్,వెంకట్రావ్‌పల్లి (బి) సర్పంచ్ ఏకుమల్లేష్,టీఆర్‌ఎస్‌మండల నాయకులు ఆకునూరి తిరుపతి, ఎండీ కమ్రోద్దిన్,వంగ కుమారస్వామి, పైడిపెల్లి సతీష్, నందికొండ రాం రెడ్డి, కొలిపాక రాజయ్య, రైతు సమన్వయ కమిటీ మండల కో ఆర్టీనేటర్ కూర సురేందర్ రెడ్డి,యూత్ నాయకులు గునిగంటి మహేందర్, భీనవేన ప్రభాకర్, దొడ్ల కోటి, టీఆర్‌ఎస్ మండల ప్రచార కార్యదర్శి మారపెల్లి కొమురయ్య, టీఆర్‌ఎస్ యూత్ సెల్ మండల అధ్యక్షులు నేరేళ్ల సునిల్, టీఆర్‌ఎస్ నాయకులు నేరేళ్ల చేరాలు, ఏనుగు లచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.