Tuesday, February 7, 2023

మరుగు లేని పల్లె మహిళ

- Advertisement -

Indian-Village-Womenప్రజలు అత్యంత పేదరికంలో మగ్గుతూ, దైనందిన అవసరాలు సైతం తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ‘పరి శుభ్రత’ అన్నది ప్రాధాన్యతలేని అంశమైపోతుంది. దాని తాలూకు సూక్ష్మ అంశాలకు ప్రాధాన్యం లేకుండా రోజూ స్నానం చేయడం కూడా ఒక లాంఛనంగా తయారవు తుంది. దేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం ఇదే పరిస్థితి వుంది.
బాత్రూంల నిర్మాణం కంటే కడుపు నింపుకోవడమే ముఖ్యమైపోయిన గ్రామీణ వ్యవస్థ మనది. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుని ఎందుకు వృథా చేసుకోవాలి అనే ప్రశ్న బాత్రూంల నిర్మాణం అంశంలో ఎదురవుతుంది. ఎందు కంటే మనుగడే అంతకంటే చాలా ముఖ్యం పేదలకు. స్నానం అనేది గ్రామాల్లో మహిళలకు కూడా అంత ప్రధానమైన అంశం కాదు. పరిశుభ్రమైన ప్రదేశాల్లో స్నానం చేయడం ఎంత ముఖ్యమో మహిళలకు తెలిసి నప్పటికీ దాని గురించి బాహాటంగా చర్చించరు. ఇలా చర్చించకపోవడం తరతరాల సాంప్రదాయాన్ని పాటించ డంగా గ్రామీణులు భావిస్తారు. దీనికంతటికీ అసలు మూలం గ్రామీణ వ్యవస్థలో ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయి. కడుపు నింపాల్సిన వారు ఎక్కువగా ఉంటారు. నిత్యావసరాలు ముందుకు వచ్చి ప్రాధాన్యతలు మారి పోతాయి. పురుషులకంటే మహిళలకు ఆరోగ్య సంబంధ మైన భద్రతాలేమి అధికం. చాలామంది మహిళలు ఆరోగ్య రక్షణ కోసం తాపత్రయ పడరు.
వారికి వైద్యరక్షణ అందని ద్రాక్ష. డాక్టర్‌ని ఆరోగ్య సమస్యలపై సంప్రదించడం అంటే కుటుంబానికి అదనపు ఖర్చు. కాబట్టి దానిని దాటవేయడానికి మహిళలు ప్రాధాన్యం ఇస్తారు. చాలామంది గ్రామీణ మహిళలకు కుటుంబానికి తిండి పెట్టడం, ఇంటిని నివసించదగ్గదిగా ఉంచడం ఆరోగ్య రక్షణ కంటే చాలా ముఖ్యం. అందు చేతనే బాత్రూం అమర్చుకోడానికి అంతగా ప్రాధాన్యతను గ్రామీణ మహిళ ఇవ్వని కారణంగా ఆమె ఆరుబయలు స్నానాలకు అలవాటు పడింది. నీరు బిందెల్లో పట్టి తీసుకురావడం అనే పని దీనివల్ల తప్పుతోంది. తెచ్చిన నీరు ఇంటి వద్ద ఆడపిల్లల స్నానాలకు వాడబడుతోంది. ఆ రకంగా ఇంట్లో సభ్యుల కోసం మహిళలు బయట స్నానం ఆచరించే ‘త్యాగం’ చేస్తున్నారు.
జార్ఖండ్ బొకారో జిల్లా చాంబరాబాద్ గ్రామంలో ఈ పరిస్థితులపై పరిశోధన జరిగింది. అందులో భాగంగా 29 మంది మహిళలను వారి దైనందిన సమస్యల గురించి ఇంటర్వూ చేశారు. ఆ పరిశోధనను విశ్లేషించి కొన్ని నిజా లను తేల్చారు. అందులో కొన్ని ఇక్కడ ప్రస్తావించు కుందాం:
చాటుమాటు లేనేలేదు

 1. ఇంటర్వూ చేసిన 29 మందిలో కేవలం ముగ్గురే తడికె లోపల స్నానం చేస్తున్నారు. తక్కిన వారు అప్పటి కప్పుడు తాత్కాలిక ఏర్పాటుతో కానిస్తున్నారు. 95 శాతం మంది రోజూ స్నానం చేస్తున్నారు. బహిష్టు రోజుల్లో పరి శుభ్రత కోసం తప్పనిసరిగా రోజూ ప్రత్యేక స్నానం చేస్తారు. 75 శాతం మంది మహిళలు కిలోమీటరు దూరంలో ఉన్న మడుగు లేదా చెరువులో స్నానం చేస్తారు. కేవలం 6 శాతం మందే నూతి వద్ద స్నానం ఆచరిస్తారు. ఎందుకంటే నూతి చుట్టూ కంచే ఏదీ సాధారణంగా ఉండదు. అందరు మహిళ లు బట్టల మీదే స్నానం చేస్తారు. మరుగు లేకపోవడం సమస్య వారిని పీడిస్తోంది.
 2. దాదాపు 44.8శాతం మంది గ్రామీణ స్త్రీలు ఎప్పుడూ పాఠశాల గుమ్మం తొక్కలేదు. 31శాతం మంది 10వ తరగతి దాకా చదువుకొన్నారు. సర్వే చేసిన 29 మందిలో ఒకరు ఇంటర్ తర్వాత డిగ్రీ చదువులు సాగిస్తున్నారు.
 3. రుతుస్రావంలో పాటించే ఆనవాయితీల విషయం లో కూడా మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోలేక పోతున్నారు. ఇతర చెత్తతో కలిపి ఆ గుడ్డలను ఆవల పారవేస్తున్నవారి సంఖ్య కేవలం 34 శాతం. 17 శాతం మంది తాము స్నానం చేసే మడుగు లేదా చెరువులోనే ఆ గుడ్డలు వేస్తున్నారు.
  కాలివేళ్ల మధ్య ఆ గుడ్డలను పట్టుకొని స్నానానికి దిగుతారు. తరువాత వేళ్లను వదులు చేసి గుడ్డలు మునిగి పోయేలా వదులుతారు. మడుగు లేదా చెరువు అడుగున అటువంటి గుడ్డలు ఎన్నో కనిపిస్తాయని 13 ఏళ్ల జార్ఖండ్ బాలిక చెబుతోంది. అతి కొద్దిమంది బాలికలు శానిటరీ నాప్కిన్స్ వాడుతున్నారు.
  కుమార్తెకైనా అమరుతుందా?
 4. జార్ఖండ్‌లో నడి వయసు స్త్రీలు చాలా మంది దగ్గర లోని మడుగులోనే స్నానం చేస్తున్నారు. తమ కుమార్తెలు ఎదిగేనాటికైనా భద్రమైన ప్రైవేటు స్నానమందిరం అందుబాటులోకి వస్తుందో లేదో అనే సందేహాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బాత్రూంలు వచ్చినా తమ ఆరోగ్యం కొత్తగా బాగుపడేది ఉండదన్న నిరాశ కూడా వారిని ఆవహించింది. అటువంటి సౌకర్యాలు యువతకు అవసరమని అన్నారు. ఇప్పుడు చాలామంది తమ ఇంటి దగ్గరలో స్నానాల గదిని కుమార్తెల కోసం నిర్మించే ఆలోచనలో ఉన్నారు.
  4.గ్రామీణ మహిళకు ఏదైనా అంటువ్యాధి సోకితే వారి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటోంది. రోజువారీ కూలీలకు అనారోగ్యంవల్ల వచ్చిన అవకాశం జారవిడుచు కుంటే మళ్లీ రాదు. చాలామంది పల్లె స్త్రీలు పొలాలలో పని చేస్తారు. కొంతమంది సొంత భూముల్లోనే కూలీలవలే శ్రమపడుతారు. రెండు సందర్భాల్లోనూ ఒక రోజు పోయిందంటే ఆ మేరకు ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. దాన్నుంచి కోలుకోవడం అంత సులభం కాదు.
  5.గ్రామీణ స్త్రీ తన ఇబ్బందులను మౌనంగా భరిస్తుందే తప్ప పైకి చెప్పుకోదు. అలా సమస్యలు చర్చకు పెట్టడం సాంప్రదాయ విరుద్ధం. గ్రామీణ భారతంలో ఈ మౌనం తీవ్రస్థాయికి చేరింది. తమ ఆరోగ్యం క్షీణిస్తే కూడా పైకి చెప్పుకోరు. ఒకవేళ వైద్యం చేయించుకున్న కేసుల్లో కూడా సౌకర్యాల లేమిని మౌనంగా భరిస్తారే తప్ప వేలెత్తి చూపరు. ఒకోసారి ఆ సౌకర్యాలలేమి వారి ప్రాణాలనే హరిస్తుంది కూడా. ప్రస్తుత సర్వేలో చాలా మంది మహిళలు తమ భర్తలకు కూడా అసౌకర్యాల గురించి చెప్పుకోరని తేలింది. తన సొంత ఆరోగ్యం కంటే కుటుంబ సంక్షేమం ముఖ్య మని మన దేశపు గ్రామీణ స్త్రీ త్యాగ బుద్ధి ప్రదర్శిస్తున్నది డబ్బులేకే తప్ప మరే కారణం వల్ల కాదు.

– మేఘనా ముఖర్జీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles