Home తాజా వార్తలు మునగాలలో చేపల చెరువు లూటీ

మునగాలలో చేపల చెరువు లూటీ

 

సూర్యాపేట: చేపల చెరువును గ్రామస్థులు లూటీ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరంలోని పెద్ద చెరువులో జరిగింది. స్థానిక మత్యకార సంఘం గత రెండు సంవత్సరాల నుంచి చేపలను పెంచుతోంది. ప్రస్తుతం ఈ చెరువు మూడు వందల ఎకరాలలో విస్తరించి ఉంది. దాదాపుగా రెండు వేల మంది గ్రామస్థులు ఒకేసారి చెరువులోకి దిగి చేపలు పట్టుతుండడంతో మత్స్యకారులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసులు వెళ్లిపోయాక మళ్లీ గ్రామస్థులు చెరువులోకి దిగి చేపలు పట్టారు. ఒకేసారి ఇంత మంది లూటీకి దిగడంతో మత్స్యకారులు చూస్తూ ఉండిపోయారు. చెరువులో చేపలు పడుతుండగా కొంత మంది సోసైటీ సభ్యులకు చేపలు ఇవ్వకపోవడంతో వారి అండదండాలతోనే చెరువు లూటీ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

Villagers Catch in Fish without Permission in Big Lake