Home జాతీయ వార్తలు క‌రోనా ఉందని వ్యక్తి దారుణ హత్య

క‌రోనా ఉందని వ్యక్తి దారుణ హత్య

Murder

 

పట్నా: బీహార్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత గ్రామస్తులే ఓ వ్యక్తిని కరోనా సోకిందాన కారణంలో దారుణంగా హత్య చేసి చంపిన ఘటన సీతామర్హి జిల్లాలోని ఓ ఊర్లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… బతుకుదెరువు కోసం భార్య పిల్లలతో మహారాష్ట్రకు వెళ్లిన ఓ వ్యక్తి లాక్ డౌన్ కారణంగా ఉపాధి దొరకక తన స్వగ్రామానికి తిరిగొచ్చాడు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తన కుటుంబానికి కూడా వైరస్ సోకిందని అనుమానంతో అతని కుటుంబాన్ని గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు.

అనంతరం ఆ వ్యక్తి తన కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని, సొంత ఊర్లోకి రానియ్యకపోతే తాను తన కుటుంబం ఎక్కడ బతుకాలని గ్రామాస్తులను ప్రశ్నించాడు. అయినా గ్రామాస్తులు వినకుండా కొంత మంది అతనిపై దాడి చేసి విచక్షరహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని శవ పరీక్ష నిమిత్తం దావాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఏడుగురిని అరెస్టు చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్ళీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులను హెచ్చరించారు.

Villagers killed the migrant worker in Bihar