Home మహబూబాబాద్ అమ్మ హస్తం..ఆగమాగం

అమ్మ హస్తం..ఆగమాగం

Villagers Wants To Amma Hastam Scheme in Telangana

మన తెలంగాణ/ పెద్దవంగర : గ్రామాల్లోని నిరుపేదలందరికీ ప్రతి నెల రేషన్‌షాపుల ద్వారా నిత్యావసర సరుకులను ప్రభుత్వం ఆందించాలి. ప్రతి నెల నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు ఉపయోగకరంగా ఉంటుంది. గత ప్రభుత్వలు రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందించేవి. ప్రతీ నెల పేదలకు ఆవసరమైన బియ్యం, పంచాదార, కిరోసిన్, పప్పులు, చింతపండు, ఉప్పు, నూనె, పసుపు, గోధుమలు, గోధుమ పిండి తదితర సరుకులను తక్కువ ధరకే అందించి పేదల కడుపు నింపేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు ఆందించకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొంటున్నారు. రెక్కాడితే డొక్కాడని ఎంతో మంది పేద ప్రజలకు రేషన్ షాపులు అండగా ఉండేవి. తక్కువ డబ్బులతో నెలకు సరిపోయే సరుకులు రేషన్ షాపుల్లో దోరికేవి. కానీ ప్రస్తుతం రేషన్‌షాపుల ద్వారా కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే వినియోగదారులకు అందిస్తున్నారు. మిగతా నిత్యావసర సరుకులు ఆందిచకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రూపాయికి కిలో బియ్యం అందించిన ప్రయోజనం లేకుండా పోతుంది. అన్నీ నిత్యావసర సరుకులు బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మండలంలో దళితులు, గిరిజనులలో చాలా మంది నిరుపేదలు నెల నెల నిత్యావసర సరుకులు రాక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దళిత గిరిజన ప్రజలు రోజువారి కూలీ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. తమకు ఉన్నా ఒకటి రెండు ఎకరాల భూముల్లో పంటలు వేసుకొని మిగతా కాలం అంతా కూలి నాలీ చేస్తూ జీవనం సాగిస్తారు. ప్రతి నెల బయట మార్కెట్‌లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే వారికి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

గతంలో మాజీ సీయం కిరణ్‌కుమార్‌రెడ్డి అమ్మహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి రూ.185లకే 9 రకాల నిత్యావసర సరుకులను అతి తక్కువ ధరలకే ఆందించేవారు. కూలి చేసి జీవించే నిరుపేదలకు ఈ పథకం బాగా ఉపయోగపడింది. చాలా మంది పేద ప్రజలు రూ. 200ల నుంచి రూ.250లతో నెలకు సరిపడా సరుకులు రేషన్‌షాపు ద్వారా తీసుకొని నెలంతా తమ కుటుంబాన్ని పోషించుకునే వారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు ఆయిన ఆనంతరం కొన్ని నెలలు ఈ పథకం ద్వారా పేదలకు సరుకులు ఆందించారు. ఆనంతరం ఒక్కొక్కటిగా సరుకులు ఆందించడం నిలిపివేశారు. ఆమ్మహస్తం పథకంలో అరకిలో చింతపండు రూ.30లకు, ఒక కిలో గోధుమపిండి రూ.16.50లకు, 100గ్రాముల పసుపు రూ.10లకు , కిలో కందిపప్పు రూ.50లకు పావుకిలో కారం రూ.20లకు, కిలోగోదుమలు రూ.7లకు, కిలో ఉప్పు రూ.5లకు, ఒకలీటరు పామాయిల్ రూ.40లకు, అరకిలో పంచాదార రూ. 6.75లకు, మొత్తం రూ.185లకే ఒక బస్తానిండా 9 రకాల నిత్యావసర సరుకలు రేషన్ షాపుల ద్వారా అందేవి . ప్రస్తుతం బియ్యం , కిరోషిన్ మాత్రమే సరఫరా చేయడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం అందించిన ప్రయోజనం లెకుండాపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు . బియ్యం అందిస్తే సరిపోతుందా మిగతా సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని పేదలు ప్రశ్నిస్తున్నారు . గతంలో మాదిరిగా ఆన్ని రకాల సరుకులు అందించి పేదాలను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు . మండలంలో దాదాపు అందరు ప్రతినెల రేషన్ షాపు ద్వారా సరుకులు పోందుతున్నారు . బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు అందించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు . కేవలం బియ్యం అందించి చేతులు దులుపుకుంటే ఎలాంటి ప్రయోజనం లెకుండా పోతుంది. రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం , కిరోసిన్ మాత్రమే సరఫరా ఆవుతున్నాయని మిగతా సరుకులు అన్నింటిని ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సురుకులనే బయోమెట్రిక్ ద్వారా ప్రజలకు అందిస్తున్నామని అధికారులు తెలిపారు .
అన్ని రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి.. ఇస్లావత్ రవినాయక్ , కోరిపల్లి
రేషన్ షాపుల ద్వారా అన్ని రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి . పేద ప్రజలకు తక్కువ ధరకే రేషన్‌షాపుల సరుకులు అందిస్తే ఇబ్బందులు ఉండవు. గ్రామాల్లోని నిరుపేదలకు రేషన్ షాపులు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ప్రస్తుతం కేవలం బియ్యం, కిరోసిన్ మాత్రమే పంపిణీ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ప్రభుత్వం స్పందించి అన్ని రకాల సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
అమ్మ హస్తం అమలు చేయాలి.. ముత్యాల పూర్ణచందర్ , పెద్దవంగర
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమ్మహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. అమ్మహస్తం పథకంతో ప్రజలకు ప్రతీ నెల సరుకులు ఇబ్బంది లేకుండా ఉండేది . గతంలో మాదిరిగా ప్రతి నెల 9 రకాల వస్తువులు పేదలకు అందేవి. ప్రస్తుతం కేవలం బియ్యం , కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. అన్ని రకాల నిత్యావసర సరుకులు అందిస్తే నిరుపేదలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి . చాలా మంది నెలనెలా సరుకులు కొనుగోలు చేసే స్థితిలో సైతం లేనివారు ఉన్నారు .