Home తాజా వార్తలు దాహం… దాహం… దాహం

దాహం… దాహం… దాహం

 

చర్ల: మండలంలో మొట్ట మొదటిగా మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించింది ఆ గ్రామంలోనె కాని ఇప్పటికి వరకు అక్కడికీ చుక్క నీరు కూడా అందలేదంటున్నారు గ్రామాస్తులు. గత మూడు సంవత్సరాలుగా ఆ గ్రామంలో ప్రైవేట్ బోర్లే దిక్కు ఈ సమస్యపై ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడ ఆ గ్రామంలోని నీటి సమస్యపై దృష్టి సారించలేదు ఎన్నిసార్లు అధికారులకు తమ గోడు విన్నవించుకున్న ఫలితం లేకుండాపోయింది. ఎట్టకేలకు సంవత్సరం క్రీతం అధికారులు ఆ గ్రామంలో బోరు నిర్మాణం చేపట్టారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దానికి కనెక్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తు వచ్చారు. ఎప్పుడు అవుతుందని గ్రామస్తులు నిలదీసి అడిగితే ప్రతిసారి ఏదో ఒక కుంటిసాకు చెపుతూ జారుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థ వారు వేసిన బోరులో కూడ నీరు ఇంకిపోవడంతో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయం మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకుపోగ యధావిధి సమాధానమే వచ్చింది దీంతో అగ్రహించిన గ్రామస్తులంతా ఆందోళన బాట పట్టారు.

అందులో భాగంగానే సోమవారం చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారిపై బిందెలతో బైఠాయించారు. తమ పనుల సైతం పక్కనబెట్టి ఆందోళన చేపట్టి తమ సమస్యను తిర్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. అంత ఎన్నికల హడావుడిలో ఉండడంతో కొద్దిసేపటి వరకు అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఈవొపిఆర్డీ నారాయణ, కార్యదర్శి సురేష్ ఆందోళన స్థలానికి రావడాని గమనించిన గ్రామాస్తులు పెద్ద ఎత్తున తమ నిరసన తెలిపారు. గ్రామస్తుల గోడు విన్న ఈవొపిఆర్డీ మిషన్ భగీరథ పనులలో కొద్దిగా ఇబ్బంది కలగడంతో నీటిని అందించండం ఆలస్యం అవుతుందని తెలియజేశారు. ఈ సమస్యని దృష్టిలో ఉంచుకొని రేపటి నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. అధికారుల హామీతో ఏకిభవించిన గ్రామస్తులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించుకున్నారు.

Villagers worry on water problem in Charla