Home తాజా వార్తలు చీకట్లో పల్లె జీవితాలు

చీకట్లో పల్లె జీవితాలు

  • వ్యవసాయంపై నీలినీడలు
  • ఉపాధి కోసం వలసలు
  • ఇక ‘జ్యోతి’ వెలుగులు
  • స్వపరిపాలన లక్ష్యం
  • స్వయం పోషకత్వం

30WLWGL01P1వరంగల్ : దశాబ్దాల నిర్లక్షం ఫలితంగా ఇపుడు పల్లె జీవితాల్లో చీకట్టుక మ్ముకున్నాయి. గ్రామ స్వరాజ్యం గురించి ఎంత ప్రకటించినప్పటికీ పల్లెల్లో ఉపాధి కరువై వలసలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు సామాజిక జీవనంతో కళకళలాడిన గ్రామాలు బావురంటున్నాయి. ప్రధానంగా పల్లె జీవితం వ్యవసాయం,అనుబంధ రంగాలు, కులవృత్తుల సమ్మె ళనంతో ముడివడి ఉంది. ఈ విధానం దెబ్బతినడంతో పల్లెలు రోజువారీ జీవనానికి గొల్లుమంటూ ఉపాధి కోసం పట్నం బాటపడుతున్నాయి. కరువు, రైతుల ఆత్మహత్యలు కలవరపరస్తున్నాయి. భూమిని నమ్ముకు న్నవారు, ప్రత్యామ్నాయం లేని వారు మాత్రమే ఇప్పుడు పల్లెలను పట్టుకొని జీవిస్తున్నారు. మూడు దశాబ్దాల ఈ క్రమానికి ప్రత్యామ్నాయ పరిష్కారం అవసరమని గత కొంతకాలంగా డిమాండ్ సాగుతున్న ప్పటికీ సర్కార్ నుంచి పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా సిఎం కెసిఆర్ నేతృత్వంలో గురువారం హైదరాబాద్‌లో గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని రూపుదిద్దేందుకు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ కరుణ, జెసి ప్రశాంత్‌జీవన్ పాటిల్‌లు హాజరయ్యారు. జిల్లాలోని పల్లెల పరిస్థితిని వివరించారు.
కలగానే గ్రామ స్వరాజ్యం
గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాం కలగానే మిగిలిపోయింది. జిల్లా లో 956 గ్రామాలున్నప్పటికీ మండల కేంద్రాలు, కొంత పెద్ద గ్రామాలు తప్ప మిగిలిన గ్రామాల్లో ప్రాథమిక వసతులు కూడా లేక తల్లడిల్లుతు న్నారు. ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, భూపా ల్‌పల్లి, కొత్తగూడ, గూడూరు, నల్లబెల్లి తదితర ఏజెన్సీ ఏరియాల్లోని గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లాలోని మహబూబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో గిరిజన తండాల సంఖ్య ఎక్కువగానే ఉంది. తండాలను గ్రామపంచాయతీలుగా మారు స్తామనే ప్రకటన ఇంకా ఆచరణరూపం తీసుకోలేదు. ఈ తండాల్లోని గిరిజనులు ఇంకా పాతకాలంనాటి పద్ధతుల్లోనే జీవనం సాగిస్తునానరు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన మృగ్యమైంది. స్వయం పోషకత్వం, స్వపరిపాలన పడికట్టుపదాలుగా మారాయి. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, మ రుగుదొడ్లు, ఆరోగ్యం, విద్య తదితర ప్రాథమిక వసతులతో పాటు ప్రధానమైన ఉపాధి సన్న గిల్లింది. రాజకీయ నాయకత్వ చొరవలేకుండా పోయింది. ఈ కారణంగా గ్రామీణ యువత ఉపాధి కోసం పట్నాలకు వలసబాట పడు తున్నారు. ఎక్కడో ఒకటి రెండు మినహా జిల్లా లోని పల్లెల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంగీషు మీడియం పల్లెపిల్లలకు అందని ద్రాక్షగానే ఉంది. సర్కార్ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరోగ్యానికి 60కి లోమీటర్లు వచ్చే గ్రామాలు ఇంకా ఉన్నాయి. గంగదేవిపల్లి లాంటి ఓ మోస్తారు పల్లె ఆదర్శంగా నిలిచాయి. జిల్లా కేంద్రానికి చేరువలో ఉండి. గ్రామీణ ఉపాధి, ప్రత్యామ్నాయ అవకా శాలను వినియోగించుకొని ముందుకు సాగింది. స్థానిక పెద్దల ముందుచూపు ఫలితా లిచ్చింది. ఇలాంటి పల్లెలు తప్ప మెజార్టీ గ్రామాలు ఇపుడు అభివృద్ధిలో వెనుకంజలోనే ఉన్నాయి. రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చి రోడ్డు మార్గంలో ఉన్న గ్రామాల్లో పరిస్థి తికి దూరప్రాంతంలో ఉన్న పల్లెలు, తండాలు, గిరిజన పలెల్లల పరిస్థితి అత్యంత దయనీ యంగా ఉంది. పిల్లల చదువుల కోసం, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, ఆరోగ్యం ఇతరత్రా అనేక కారణాల రీత్యా తాజాగా పల్లె కలతప్పింది.
గ్రామజ్యోతిపై ఆశలు
ప్రధానంగా గ్రామాల్లో ఆదాయం తగ్గడం వల్ల అభివృద్ధిపై ప్రభావం కన్పిస్తోంది. స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామపంచాయతీలు, నగర పంచాయతీలు, చివరికి ము న్సిపాలిటీలు సైతం కనీస అభివృద్ధి రాష్ట్ర, కేంద్రాల నిధు లపై ఆధారపడాల్సి వస్తోంది. ఆదాయం మెరుగుపరుచుకోవడం, ఉపాధిని పెంపొందిం చే దీర్ఘకాలిక చర్యలు పల్లెను పునాదిగా చేసు కొని చేపట్టకపోవడంతో రోజువారీ కార్యకల పాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల వేత నం పెంచి చెల్లించలేని దుస్థితిలో ఈ స్థానిక సంస్థలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రారంభించనున్నట్లు ప్రక టించిన గ్రామజ్యోతి పథకంపై ఆశలు చిగురిస్తున్నాయి. నిధుల వ్యయం, ఆదాయం పెంపుదల,ఉపాధి నైపుణ్యం కల్పించడంతో పాటు ప్రభుత్వం, ఎన్జీవోస్‌ల సహకారం, సమ న్వయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్న ట్లు ప్రకటించారు. ఇందులో స్థానిక ప్రజాప్రతి నిధుల భాగస్వామ్యం ప్రధానంగా మారనున్న ది. ముఖ్యంగా పల్లెలకు పట్టుగొమ్మగా ఉన్న వ్యవసా యాన్ని,అనుబంధ రంగాలను లాభసా టిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే ఈ పథకంలో పల్లెల్లో వెలుగులు నింపుతాయని అంటున్నారు.