Home తాజా వార్తలు పవన్ సినిమా : అతిథి పాత్రలో వినాయక్

పవన్ సినిమా : అతిథి పాత్రలో వినాయక్

Vinayak Will Play Guest Role In Pawan Movieహైదరాబాద్ : సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ లో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అతిథి పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.  ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాలో  డైరెక్టర్ సాచీ క్యామియో అతిథి పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే తెలుగులో ఆ పాత్రను వి.వి.వినాయక్ పోషించనున్నారని సమాచారం. వినాయక్ గతంలో  ‘ఠాగూర్’. ‘నేనింతే’. ‘ఖైదీ నెం. 150’ సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు.  వినాయక్ ప్రధాన పాత్రలో ‘శీనయ్య’ అనే సినిమా ప్రారంభమై అనివార్య కారణాలతో  ఆగిపోయింది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్న  ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.