Saturday, April 20, 2024

ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Vinayaka chavithi celebrations in telugu

 సిద్దిపేట: ఏక వినాయకున్ని ప్రతిష్ఠిద్దాం ..ఐక్యత చాటి చెపుదామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందామన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు హరీష్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు  సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద బిసి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో , రామరాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయం లో 36 వ వార్డు కౌన్సిలర్ ఉదర విజయ ఆధ్వర్యంలో మట్టి విగ్రహల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడారు. బిసి కార్పోరేషన్ ద్వారా మట్టి గణపతులను పంపణి చేయడం సంతోషంగా ఉందని, కుమ్మరి కుల వృత్తి కి వన్నె తెచ్చేలా, వారికి ఆర్థికంగా పరిపుష్టి పెంచే విధంగా ఉపాధి కల్పించేల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పుణ్యం పురుషార్థం అన్నట్టు.. దేవుని విగ్రహం తయారు చేయడంతో వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు.

బుధవారం సిద్దిపేటలో బిసి కార్పోరేషన్ మట్టి విగ్రహలను పంపణి చేస్తున్నామని, విఘ్నేశ్వరుని దయతో కరోనా నుంచి విఘ్నాలు తొలగాలని ప్రార్థించారు. విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుని అనుగ్రహం మన అందరిపై ఉండాలన్నారు. దేవుణ్ణి పూజిద్దాం… ప్రకృతిని ప్రేమిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని, ప్రజలు ప్రతి ఇంటిలో మట్టి గణపతి ప్రతిమనే పూజించాలి.. ఇంటిల్లిపాది విఘ్నేశ్వరున్ని ఆరాధించాలన్నారు. అందరం ఇంట్లోనే మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించుకోని ఇంటిల్లిపాది వేడుకగా పూజించాలని, ప్రకృతిని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ వినాయక చవితి అని హరీష్ రావు ప్రశంసించారు. మట్టి గణపతినే పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రకృతి సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దామన్నారు.  ప్లాస్టిక్ పూలు, దండలు వద్దు, నిమజ్జనం సమయంలో చెరువులలో, వాగులను ప్లాస్టిక్ రహితంగా ఉంచుకొని పర్యావరాన్ని సంరక్షించుకుందామని పిలుపునిచ్చారు. మన అందరిపై విఘ్నేశ్వరుని అనుగ్రహము ఉండాలని కోరుకుంటున్నామని,  ఈ పర్వదినాన్ని ఎవరి ఇంట్లో వారు వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News