Home తాజా వార్తలు ఈటెలకు ఆ సీటును కెసిఆర్ కేటాయించారు: వినోద్ కుమార్

ఈటెలకు ఆ సీటును కెసిఆర్ కేటాయించారు: వినోద్ కుమార్

హైదరాబాద్: 2004 ఎన్నికల్లో ఎంతో మంది అడిగినా కమలాపూర్ సీటును ఈటెల రాజేందర్‌కు సిఎం కెసిఆర్ కేటాయించారని మాజీ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. టిఆర్‌ఎస్ గెలుస్తుందనే ఈటెల 2003లో పార్టీలోకి వచ్చారన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వాన్నే ఈటెల ఎలా ఛాలెంజ్ చేస్తున్నారని విరుచుకపడ్డారు. రాజకీయ నాయకలెవరూ అసైన్డ్ భూముల జోలికిపోవద్దని తెలియజేశారు. అసైన్డ్ భూములు కొనడం తప్పుకాదన్నట్టుగా ఈటెల తీరు ఉందని మండిపడ్డారు. 2001లో టిఆర్‌ఎస్ పార్టీ పెట్టి సిఎం కెసిఆర్ నాయకులందరినీ తయారు చేశారని, తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తరువాతనే ఈటెల టిఆర్‌ఎస్ చేరారని గుర్తు చేశారు.