Home తాజా వార్తలు గూర్ఖాలాండ్ ఉద్యమంలో హింస : పోలీసు మృతి

గూర్ఖాలాండ్ ఉద్యమంలో హింస : పోలీసు మృతి

GJMM

డార్జిలింగ్ : ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారులు హింసకు దిగారు. దీంతో శనివారం ఉదయం నుంచి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు, గాజు బాటిళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ ఛార్జి కూడా జరిగింది. ఈ ఘర్షణలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ కమాండర్ టిఎస్ తమాంగ్ మృతి చెందినట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘర్షణలో ఇద్దరు ఆందోళనకారులు కూడా మృతి చెందినట్టు గూర్ఖా జనముక్తి మోర్చా తెలిపింది. తమ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జిజెఎమ్ చీఫ్ బిమల్ గురంగ్ స్పష్టం చేశారు.