Home తాజా వార్తలు విరాట్… అనుష్కకు విడాకులు ఇవ్వు: బిజెపి ఎంఎల్ఎ

విరాట్… అనుష్కకు విడాకులు ఇవ్వు: బిజెపి ఎంఎల్ఎ

 

లక్నో: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు విడాకులు ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ బిజెపి ఎంఎల్‌ఎ నంద కిశోర్ గుర్జర్ సూచించారు. అనుష్కపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనుష్క తాజాగా పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ఆ సినిమాలో బిజెపి ఎంఎల్‌ఎ నందకిశోర్ ఫోటోను వాడారు. ఈ సిరీస్‌లో ప్రతి నాయకుడి పాత్రలో నందకిశోర్ ఫోటోను వాడారు. తన అనుమతి లేకుండా తన ఫోటో ఎలా వాడుతారని, తనని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఎంఎల్‌ఎ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వెబ్ సిరీస్ నిషేధం విధించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ ద్వారా చేశారు. కోహ్లీ దేశ భక్తితో భారత్ తరపున క్రికెట్ ఆడుతున్నారని, కోహ్లీ అనుష్కకు విడాకులు ఇవ్వాలని నంద కిషోర్ డిమాండ్ చేశారు.