Home Default రికార్డుల మోత మోగిస్తున్న విరాట్

రికార్డుల మోత మోగిస్తున్న విరాట్

Virat-Kohli

 

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ 238 బంతుల్లో 201 పరుగులు చేశాడు.  కెప్టెన్ గా విరాట్ ఆరు డబుల్ సెంచరీలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. రెండు టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఐదు డబుల్ సెంచరీలతో బ్రియన్ లారా రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 471 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో  విరాట్ కోహ్లీ (211), రోహిత్ శర్మ (50) బ్యాటింగ్ చేస్తున్నారు.