న్యూఢిల్లీ : 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సాధించిన ఐసిసి ఆల్-టైమ్ బ్యాటింగ్ రేటింగ్ పాయింట్స్ల ను భారత్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమించే అవ కాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా తన బ్యాటింగ్‌ను ఝళిపిస్తు ప్రతిర్థి జట్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న విరాట్ సంచలన విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 2016 నుంచి అన్ని ఫార్మాట్లలో అద్భుత మైన తన ఆటతీరుతో పరుగుల వరద పారించిన కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు కీర్తిని తెచ్చిపెట్టాడు. ఫిబ్రవరి 23న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ అదే ఆటను కొనసాగిస్తే 898 పాయింట్లతో 31వ స్థానంలో ఉన్న లిటిల్ మాస్టర్ సచిన్ సాధించిన ఐసిసి ఆల్-టైమ్ బ్యాటింగ్ రికార్డులను అధిగమించడం ఖా యం. ప్రస్తుతం సచిన్ ఆల్‌టైమ్ రేటిం గ్‌కు కోహ్లీ మూడు పాయింట్లు వెను క వరుసలో ఉన్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ తో 875 పాయింట్లు సాధించిన కోహ్లీ ఐసిసి ఆల్-టైమ్ బ్యాటింగ్ ర్యాం కింగ్స్‌లో 33వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ వాట్, దక్షి ణాఫ్రికా ఆటగాడు ఆండీ ఫ్లవర్ కలిసి 895 పాయింట్లు సాధించారు. గతం లో సునీల్ గవాస్కర్ 916 పాయింట్లు సాధించగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మాన్ 961 పాయింట్లతో టాప్ జాబితాలో ఉన్నారు.
సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించే అవకాశం!
- Advertisement -
- Advertisement -