Home తాజా వార్తలు కోహ్లీ సెంచరీ…. భారత్ 380/4

కోహ్లీ సెంచరీ…. భారత్ 380/4

 

పుణే: భారత- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండు టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 118 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ 14 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. అగర్వాల్ 108 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో డూప్లిసెస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పూజారా 58 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. రెండో రోజు రహానే 59 పరుగులు చేసి మహారాజ్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.  రెండో రోజు విరాట్ కోహ్లీ సెంచరీతో (122) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్(122), జడేజా(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా మూడు వికెట్లు పడగొట్టగా మహారాజ్ ఒక వికెట్ తీశాడు. విరాట్ కోహ్లీ వన్డే, టెస్టులకు కెప్టెన్ గా ఉండి 40 సెంచరీలు చేశాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ వన్డే, టెస్టుల్లో కలిపి 41 సెంచరీలు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. పాక్ బ్యాట్స్‌మెన్ 120 టెస్టులో 25 సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీ 81 టెస్టుల్లో 26 సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. టెస్టు, వన్డేల్లో 69 సెంచరీలతో విరాట్ మూడు స్థానంలో ఉండగా రికీ పాంటింగ్ (72) రెండో స్థానం, సచిన్ 100 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు.  

 

Virat Kohli Century in Second Test in SA vs IND