Thursday, April 25, 2024

ఐసిసి టి20 ర్యాంకింగ్స్: టాప్5లో విరాట్

- Advertisement -
- Advertisement -

దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసిసి ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టి20 మ్యాచుల్లో అర్ధ సెంచరీలతో చెలరేగిన కోహ్లి టాప్5లో చోటు సంపాదించాడు. రెండో టి20లో 73, మూడో మ్యాచ్‌లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి 47 రేటింట్ పాయింట్లను సంపాదించాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక భారత ఓపెనర్ కెఎల్.రాహుల్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ విఫలం కావడం రాహుల్ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. కాగా, ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ 894 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) రెండో, బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) మూడో ర్యాంక్‌లో నిలిచారు. ఆజమ్ మూడో ర్యాంక్‌కు ఎగబాకగా రాహుల్ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు భారత్‌పై నిలకడగా ఆడుతున్న జోస్ బట్లర్, బెయిర్‌స్టోలు కూడా ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు నిరాశ పరిచారు. టాప్10లో ఏ ఒక్క భారత బౌలర్ చోటు సంపాదించలేక పోయాడు.

Virat Kohli climb to No 5 in ICC T20I Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News