Home తాజా వార్తలు విరాట్ డబుల్ ధమాకా… భారత్ 506/4

విరాట్ డబుల్ ధమాకా… భారత్ 506/4

 

 

పుణే: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 147 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులతో రెండో రోజు ఆట ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. భారత తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసి క్రికెటర్ విరాట్ రికార్డు సృష్టించాడు.  విరాట్ ఏడు డబుల్ సెంచరీలు చేయగా గతంలో సచిన్, సెహ్వాగ్ ఆరు డబుల్ సెంచరీలు చేశారు. డాన్ బ్రాడ్ మాన్ 12 డబుల్ సెంచరీలో తొలి స్థానంలో ఉన్నాడు. విరాట్ 306 బంతుల్లో 211 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి రోజు మయాంక్ అగర్వాల్ శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో విరాట్(211), జడేజా(38)లు ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా మూడు వికెట్లు తీసి మహారాజ్ ఒక వికెట్ పడగొట్టారు. విరాట్ కోహ్లీ ఏడు వేల పరుగుల క్లబ్ లో చేరాడు. 

 

Virat Kohli Double Century in SA v IND 2nd Test