Saturday, June 21, 2025

విరాట్‌కు అవమానం.. ఆనవాయితీని ఉల్లంఘించిన బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

సాధారణంగా దిగ్గజ క్రికెటర్లు రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఆ ఆటగాళ్లకు గౌరవాన్నిస్తూ.. వాళ్ల జెర్సీకి కూడా రిటైర్‌మెంట్ ప్రకటిస్తారు. అంటే ఆ జెర్సీని మరెవరికీ కేటాయించరు. కానీ విరాట్ కోహ్లీ (Virat Kohli) విషయంలో మాత్రం బిసిసిఐ ఆ ఆనవాయితీని ఉల్లంఘించింది. టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అతను ధరించే 18 నెంబర్ జెర్సీని (Jersey) వేరొకరికి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఎ ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నెంబర్ జెర్సీతో కనిపించాడు.

అయితే బిసిసిఐ ఏ ఉద్ధేశ్యంతో ఈ పని చేసిందో తెలియదు కానీ.. విరాట్ (Virat Kohli) అభిమానులు మాత్రం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ జెర్సీని (Jersey) వేరొకరికి కేటాయించడమంటే అతన్ని అవమానించినట్లే అని అంటున్నారు. విరాట్ భారత టెస్ట్ క్రికెట్‌కి ఎంతో సేవ చేశాడని.. అలాంటి వ్యక్తిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. సాధారణంగా దిగ్గజ క్రికెటర్లు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు వీడ్కోలు సభ కానీ, లేదా అవకాశం ఉంటే ఫేర్‌వెల్ మ్యాచ్ కానీ ఏర్పాటు చేస్తారు. కానీ, విరాట్ విషయంలో ఇవేవీ చేయకపోగా.. అతని జెర్సీని ముకేశ్‌కి కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News