Home స్కోర్ వన్డే ర్యాంకింగ్స్ విరాట్ కోహ్లి @ 3

వన్డే ర్యాంకింగ్స్ విరాట్ కోహ్లి @ 3

Virat-Kohli

దుబాయి: ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఐసిసి మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కోహ్లి 852 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో నిలిచాడు. కిందటిసా రి కూడా కోహ్లి మూడో ర్యాంక్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, సౌతాఫ్రికా కెప్టెన్ ఎబి.డివిలియర్స్ వన్డేల్లో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో డివిలియర్స్ 874 పాయింట్లతో మొదటి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్-సౌతాఫ్రికా వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఐసి సి ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. డివిలియర్స్ మూడు పాయింట్ల ఆధిక్యంతో మొదటి ర్యాంక్‌ను సాధించాడు. మరోవైపు ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 871 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వార్నర్ మొదటి ర్యాంక్‌కు చేరువలో ఉన్నాడు. కాగా, భారత స్టార్ కోహ్లి మాత్రం ఇద్దరి కంటే పాయింట్లలో కాస్త వెనుకబడి ఉన్నాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న వార్నర్ కంటే కోహ్లి 19 పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు. కాగా, కోహ్లి తప్ప మరే భారత బ్యాట్స్‌మన్ టాప్-10లో చోటు సంపాదించలేక పోయారు. రోహిత్ శర్మ 12వ స్థానంలో నిలిచాడు. మాజీ కెప్టెన్ మ హేంద్ర సింగ్ ధోనీ 13వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ ర్యాంక్‌ను దిగజారి 15వ స్థానంతో సంతృప్తి పడ్డాడు. ఇక, బౌలింగ్‌లో ఏ భారత బౌలర్ కూడా టాప్ టెన్‌లో చోటు సాధించలేక పోయాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో నిలిచాడు. అమిత్ మిశ్రా 13వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. భారత స్టార్ బౌల ర్ రవిచంద్రన్ అశ్విన్ 18వ ర్యాంక్‌ను సాధించాడు. కాగా, టాప్-20 ర్యాంకింగ్స్‌లో భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌కు చెందిన నలుగురేసి బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకునన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్‌కు చెందిన సాకిబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ను సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచారు. కాగా, టీమ్ ర్యాంకింగ్స్‌లో 122 పాయింట్లతో సౌతాఫ్రికా టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో 117 పాయింట్లతో భారత్ మూడో ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్ నాలుగో, ఇంగ్లాండ్ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.