- Advertisement -
ముంబయి : టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్గా ఎంఎస్ వైదొలుతున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధోని స్థానంలో డాషింగ్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం టెస్టు కెప్టెన్గా ఉన్న కోహ్లీకి వన్డే, టి-20 ఫార్మాట్లలోనూ జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్తో మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్లకు భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ మేరకు జట్టును శుక్రవారం భారత సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు.
- Advertisement -