Home తాజా వార్తలు బికినీలో మెరిసిన అనుష్క శర్మ

బికినీలో మెరిసిన అనుష్క శర్మ

Bikini

వెస్టిండీస్: విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ దంపతులు విండీస్ టూర్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుష్క  ఆరేంజ్ కలర్ బికినీ ధరించి బీచ్‌లో కూర్చున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ సూర్యుడిని ముద్దాడుతూ, దీవెనలు తీసుకుంటున్నట్టుగా ఉందని కామెంట్ చేసింది. ఈ ఫోటోపై విరాట్ రియాక్షన్ ఇచ్చాడు. చిత్రం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. హార్ట్ సింబల్‌, నవ్వుతూ ఉన్న ఇమోజీతో రిప్లై ఇచ్చాడు. అనుష్క తన ఫోటోను షేర్ చేసిన ఐదు గంటల్లోనే 15 లక్షల మంది వీక్షించగా 6806 మంది కామెంట్ చేశారు. 2008 అగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ అడుగుపెట్టాడు. అప్పటి ఫోటోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఆదివారం పోస్టు చేశాడు. 11 సంవత్సరాల జర్నీ అద్భుతంగా ఉందని తెలిపాడు. దేవుడి దయతోనే ఈ రికార్డులను సృష్టించానని చెప్పుకొచ్చాడు. మనలో శక్తి, బలం అనేది ఉందని అది కష్టపడితేనే బయటకు రావడంతో పాటు కల నెరవేరుతుందన్నారు. వన్డేలో 2008లో శ్రీలంకపై తొలి మ్యాచ్ ఆడాడు.  వన్డేలో అతి తక్కువ మ్యాచ్‌లో 43 సెంచరీలు చేసి విరాట్ రికార్డు సృష్టించాడు. వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ గా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు.

 

View this post on Instagram

Sun kissed & blessed 🧡⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

 

 

 

 

 

Anushka Sharma Wear Bikini in Beach